- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఐబొమ్మ రవి తరఫున న్యాయవాది సలీం ఉచితంగా వాదిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో రవి తండ్రి అప్పారావు (Appa Rao)ను కలిశారు. రవి కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా, అందుకు అప్పారావు నిరాకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: పైరసీ కేసులో అరెస్టు అయిన నిందితుడు రవి తరపున ప్రముఖ లాయర్ సలీం (Salim) వాదించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో సలీం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోడికత్తి, గులకరాయి కేసులను ఆయనే వాదించారు. ఆ కేసుల్లో ముద్దాయిలకు బెయిల్ తెచ్చిపెట్టారు. ఇప్పుడు iBOMMA రవి కేసును కూడా వాదించేందుకు ముందుకు వచ్చారు. చట్టం ప్రకారం అతడిని అరెస్టు చేసినట్లే, అదే చట్టం ప్రకారం ముద్దాయి తరపున వాదించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. రవి హక్కుల కోసం వృత్తి ధర్మంగా పోరాడతానని సలీం చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే న్యాయవాది సలీం విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా పెదగత్తిలిసాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావు (Appa Rao)ను కలిశారు. రవి కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా, అందుకు అప్పారావు నిరాకరించారు. ఇప్పటికే తన ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉందని, భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక, సహనం తనకు లేవని, తనను వదిలేయండని రవి తండ్రి అప్పారావు స్పష్టంగా చెప్పేశారు.






