- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Jupally: ఐఏఎస్ రిజ్వి వీఆర్ఎస్ కాంట్రవర్సీ.. మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
ఐఏఎస్ రిజ్వి వీఆర్ఎస్ కాంట్రవర్సీ పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐఏఎస్ రిజ్వి వీఆర్ఎస్ కాంట్రవర్సీ పై మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) స్పందించారు. గురువారం సచివాలయంలో కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడయాతో సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ లో నేను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారు. నాపై చేసిన ఆరోపణల మీద పరువు నష్టం వేస్తా అని అన్నారు. ‘IAS అధికారి సామ్ రిజ్వీ (IAS Rizvi) వీఆర్‌ఎస్ తీసుకున్నారు, ఎందుకంటే ఆయనకు AIG ఆసుపత్రిలో నెలకు రూ.10 లక్షల జీతంతో ఉద్యోగం దొరికింది’ అని ఆయన మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయానికి కేటీఆర్ ముడి పెట్టి.. రాజకీయ రంగు పులుముతున్నారని అన్నారు. టెండర్లు పిలవకముందే రూ.500 కోట్ల ముడుపులు అని సీఎం అల్లుడు లేదా నా కుమారుడి పేర్లు లాగడం ఏంటి అర్థం..? అని ప్రశ్నించారు. కావాలనే కేటీఆర్ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే లిక్కర్‌కు బ్రాండ్ అంబాసడర్’ అని విమర్శించారు.






