మేడం సార్.. మేడం అంతే..! పాపకు జోల పాడిన కలెక్టర్ పమేలా సత్పతి వీడియో వైరల్

by Ramesh Naini |

తెలంగాణలో ఉన్నత హోదాలో ఉన్న కొంత మంది అధికారులు వృత్తి పరంగానే కాకుండా ప్రజల్లో కలిసిపోతూ అందరి మనసు దోచుకుంటారు.

మేడం సార్.. మేడం అంతే..! పాపకు జోల పాడిన కలెక్టర్ పమేలా సత్పతి వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (viral Videos) తెలంగాణలో ఉన్నత హోదాలో ఉన్న కొంత మంది అధికారులు వృత్తి పరంగానే కాకుండా ప్రజల్లో కలిసిపోతూ అందరి మనసు దోచుకుంటారు. తీరిక లేనంత పనుల్లో బిజీగా ఉన్నా.. మహిళా సాధికారత, స్కూల్ చిన్నారుల వికాసం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో కరీంగనర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) ఒకరు. తాజాగా కలెక్టర్ పమేలా సత్పతి తన గాన ప్రతిభను మరోసారి ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ చిన్నారి పాపకు పమేలా సత్పతి జోల పాట పాడింది. ఆమె పాటకు చిన్నారి కూడా శ్రద్ధగా వింటూ కలెక్టర్ ఒడిలో అల్లరి చేయకుండా కూర్చుంది.

‘పియు బోలే’ అనే హిందీ పాటను ఎంతో చక్కగా జోల పాటల పాడి.. పాపను నిద్రపుచ్చారు. 2005లో వచ్చిన ‘పరిణీత’ (Parineeta) అనే బాలీవుడ్ సినిమాలోని ఈ పాటను ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ పాడారు. అదే తీరులో కలెక్టర్ పాపకు జోల పాటల పాడి అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు కలెక్టర్‌ను ప్రశంసించారు. మేడం సార్.. మేడం అంతే.. అంటూ కొనియాడారు. ప్రొఫెషనల్‌ సింగర్ అయిన శ్రేయ‌ఘోషల్ (Shreya Ghoshal) మాదిరి అద్భుతంగా పాడారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

గతంలోనూ కలెక్టర్ పమేలా సత్పతి పిల్లల కోసం ఏబీసీడీలతో పాట పాడిన విషయం తెలిసిందే. అంగన్ వాడీల బలోపేతంపై పమేలా సత్పతి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘ఏ అంటే ఆపిల్, బీ అంటే బాల్‌’ కు బదులుగా.. ‘ఏ ఫర్‌ యాక్టివ్‌.. బీ ఫర్‌ బ్రైట్‌.. సీ ఫర్‌ క్రియేటివ్‌’ అంటూ ఇంగ్లిష్‌ ఆల్ఫాబెట్స్‌కు సరికొత్త పదాలతో పాడారు. పమేలా సత్పతి 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. నాలుగో ప్రయత్నంలో 51వ ర్యాంకు సాధించి భద్రాచలం జిల్లా సబ్‌ కలెక్టర్‌గా, వరంగల్ క‌మిష‌న‌ర్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంగనర్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక, ఆమె మాతృభాష ఒడియా అయిన హిందీ, ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతారు. తెలుగు రాయగలరు, చదవగలరు.

Next Story