సీఎస్ పదవి కోసం ఐఏఎస్ ల గట్టి పైరవీ

by Muthe.Rajitha |

తెలంగాణ సీఎస్(Chief Secretary) రామకృష్ణారావు(Rmakrishna Rao) పదవీకాలం ఈనెల 31తో ముగియనున్న సంగతి తెలిసిందే.

సీఎస్ పదవి కోసం ఐఏఎస్ ల గట్టి పైరవీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎస్(Chief Secretary) రామకృష్ణారావు(Rmakrishna Rao) పదవీకాలం ఈనెల 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త సీఎస్ గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 2025 ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు పదవీవిరమణ కాలం ఆగస్టు 30తో ముగియనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మరో 6 నెలలు సీఎస్ గా రామకృష్ణారావునే పొడగించాలని లేఖ రాసింది. మరోవైపు సీఎస్ పదవి కోసం పలువురు ఐఏఎస్ లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

వీరిలో జయేష్ రంజన్, శశాంక్ గోయల్, వికాస్ రాజ్ సహా మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. రామకృష్ణా రావునే సీఎస్ గా కొనసాగించాలనే ఉద్దేశం ఉన్న సర్కారు మాత్రం కొత్త సీఎస్ నియామకం కోసం ఎలాంటి కసరత్తులు చేయడం లేదట. మరి సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు సీఎస్ గా రామకృష్ణారావునే కొనసాగిస్తారా? లేక కేంద్రం అందుకు ఒప్పుకోకపోతే కొత్త సీఎస్ ను ఎంపిక చేస్తారా అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.

Next Story