- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IAS ఆఫీసర్ స్మిత సబర్వాల్ కు తీవ్ర అనారోగ్యం
ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు స్మిత తన X ఖాతాలో ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసారు. తాను కొన్ని నెలలుగా వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్(VAD)తో బాధపడుతున్నానని వెల్లడించారు. ఇది చాలా నొప్పితో కూడిన అనారోగ్యం అని, త్వరలోనే దాని నుంచి బయటిపడి, బలంగా తయారవుతానని వీడియోలో పేర్కొన్నారు. అయితే స్మితకు తెలంగాణ ప్రభుత్వం 6 నెలల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయడంతో.. ఆమెకు ఏమైందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే తాను సెలవులపై వెళ్ళడానికి గల కారణాన్ని వెల్లడించారు. అయితే స్మిత ట్వీట్ కింద 'గెట్ వెల్ సూన్', 'టేక్ కేర్' అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
VAD అంటే ఏంటి?
వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్(VAD) అనేది వెన్నముఖ ధమని లోపలి పొరలో సంభవించే చిన్న చీలిక. అయితే ఈ ధమని ఊపిరితిత్తుల నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళాల్లో ఒకటి కాగా, VAD వలన మెదడుకు రక్త సరఫరా తగ్గి, తరచూ తీవ్రమైన తలనొప్పి, మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. హైబీపీ, మైగ్రేన్ వంటివి VAD కి దారి తీస్తాయి. ప్రస్తుతం స్మిత సబర్వాల్ తాను VAD నుంచి మెల్లగా కోలుకుంటున్నట్టు పేర్కొంటూ ట్వీట్ చేశారు.






