- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరైన మాజీ సీఎండీ ప్రభాకర్‌రావు, ఐఏఎస్ అర్వింద్
విద్యుత్ అవకతవకలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఎంక్వైరీని స్పీడప్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు ట్రాన్స్ కో, జెన్ కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐఏఎస్ ఆఫీసర్, గత ప్రభుత్వంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన అరవింద్‌కుమార్ హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, ఇతర అంశాలపై ప్రభాకర్ రావు, అరవింద్ నుంచి జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ వివరాలు సేకరించినట్లు సమాచారం. కాగా రాష్ట్రప్రభుత్వానికి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేందుకు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ విచారణను వేగవంతం చేసింది. విద్యుత్ అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ఇప్పపటికే బహిరంగ ప్రకటన జారీ చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. చత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రాష్ట్రానికి గుదిబండగా మారనున్నాయని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో టెండర్ల ద్వారా కాకుంటా కాంట్రాక్టులను నామినేషన్ పై కేటాయించడం, కాలం చెల్లిన టెక్నాలజీని ఉపయోగించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తులు, విద్యుత్ రంగ నిపుణులు, సంస్థల నుంచి సూచనలు కమిషన్ స్వీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ కమిషన్ ఎదుట హాజరు కావడం ఆసక్తిగా మారింది.






