ఆ రాష్ట్ర సీఎంలా పనిచేస్తా.. అధ్యక్ష పదవిపై మరోసారి రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ రాష్ట్ర సీఎంలా పనిచేస్తా.. అధ్యక్ష పదవిపై మరోసారి రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) లాగా పని చేస్తానని అన్నారు. తనకు ఈ ఒక్కసారి అధ్యక్షుడిగా పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త తనను ప్రెసిడెంట్‌గా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ అలానే జరిగితే.. రాష్ట్రంలో గోరక్షణ విభాగం ఏర్పాటు చేసి, గోరక్షకులకు అండగా నిలుస్తానని తెలిపారు. బీజేపీ హిందుత్వ పార్టీ అని.. యోగి ఆదిత్యనాథ్ లాగా పని చేస్తామని, పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

Next Story