- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివంపేట అభివృద్ధికి కృషి చేస్తా
శివంపేట మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

దిశ, శివంపేట : ప్రజా ప్రభుత్వంలో భాగంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు వచ్చే విధంగా కృషి చేయాలని మెదక్ జిల్లా శివంపేట మండలానికి చెందిన సర్పంచులు ముఖ్య నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలో కేంద్రంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ వారితో మాట్లాడుతూ శివంపేట మండల అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను, ప్రజలందరికీ వివరించే బాధ్యత ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులపై ఉందని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సుధీర్ రెడ్డి, పులిమామిడి నవీన్ గుప్తా, నర్సాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పెద్దపట్లూరి మాధవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కమలా పుల్ సింగ్, సర్పంచులు, దొంతి రెడ్డి అరుణ రెడ్డి,కుమ్మరి హైమావతి ఆంజనేయులు, బుర్ర మురళి గౌడ్, కండెగారి ఆంజనేయులు, అయ్యంగారి యాదగిరి,లక్ష్మీ దుర్గ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.






