- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల పక్షాన గళం వినిపిస్తా : సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం
మండలిలో ప్రజల తరుపున గళం విప్పుతానని సీపీఐ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మండలిలో ప్రజల తరుపున గళం విప్పుతానని సీపీఐ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై చట్టసభల్లో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రజల కోసం పోరాడుతూ వస్తున్నానని తెలిపారు. దీంతోనే పార్టీ పెద్దలు తనను గుర్తించి ఎమ్మెల్సీగా ప్రకటించారని ఆయన స్పష్టం చేశారు. సీపీఐ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని ఈ సందర్భంగా సత్యం తెలిపారు. అలాగే, కాంగ్రెస్పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఎమ్మెల్సీగా ఛాన్స్ఇవ్వడం శుభాపరిణామం అన్నారు.
ఎన్నికల ఒప్పందంలో భాగంగా హామీని అమలు చేసే సందర్భంలో సీఎం రేవంత్రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు, పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్,సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజ, నారాయణ, అజీజ్పాష, రాష్రకార్యదర్శి కూనం నేని సాంబశివరావు, కృషితోనే సీపీఐకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిందని పేర్కొన్నారు. ‘తాత్కలికంగా చట్టసభలలో తక్కువ సంఖ్యలో ఉన్పప్పటికీ భవిష్యత్తులో ప్రజలు మళ్లీ కమ్యూనిస్టు ఉద్యమాలు, పార్టీవైపు ఆలోచన చేసే దిశగా పరిస్థితి కనబడుతుందని, కాంగ్రెస్పార్టీ ఎన్నికల ఒప్పందంలో భాగంగా వారుచ్చినటువంటి ధర్మాన్ని పాటించారు. ఈసందర్భంగా వారికి ప్రత్యేకంగా అభ్యర్థిగా సత్యం కృతజ్ఞతలు తెలియజేశారు.






