మనవడిలా మీకు సేవ చేస్తా.. వృద్ధులతో మంత్రి కేటీఆర్ తనయుడు Himanshu Rao Kalvakuntla

by Taduka Kalyani |   (  Updated:2023-07-12 12:01:55  IST  )

మనవడిలా మీకు సేవ చేస్తా రాష్ట్ర సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు అన్నారు.

మనవడిలా మీకు సేవ చేస్తా.. వృద్ధులతో మంత్రి కేటీఆర్ తనయుడు Himanshu Rao Kalvakuntla
X

దిశ, శంషాబాద్: మనవడిలా మీకు సేవ చేస్తా రాష్ట్ర సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు అన్నారు. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుప్పర లోని మర్యా సదన్ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం కల్వకుంట్ల హిమాన్షు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వృద్ధులకు పండ్లు, బట్టలు పంపిణీ చేశారు.

అనంతరం వృద్ధులతో కలిసి మాట్లాడి వారి భాగోగులు తెలుసుకొని వారి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, ఎంపీటీసీలు ఇందిరా కృష్ణ గౌడ్, సర్పంచులు రాంగోపాల్, మహేందర్ రెడ్డి, నాయకులు దిద్యాల శ్రీనివాస్, నీరటీ రాజు, శ్రీకాంత్ గౌడ్, రమేష్, రాజశేఖర్ గౌడ్, విద్యా చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More : మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్‌తో స్పీచ్ ఇచ్చి అదరకొట్టిన నవీన్ పొలిశెట్టి.. వీడియో వైరల్

Next Story