మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాగోతం బయటపెట్టిన కవిత.. ఇంకొందరు కూడా అంటూ హింట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-03 09:41:16  IST  )

జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్‌ మీట్ ముగిసిన వెంటనే కల్పకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మీడియా మిత్రులతో చిట్‌చాట్ (Chitchat) నిర్వహించారు.

మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాగోతం బయటపెట్టిన కవిత.. ఇంకొందరు కూడా అంటూ హింట్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్‌ మీట్ ముగిసిన వెంటనే కల్పకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మీడియా మిత్రులతో చిట్‌చాట్ (Chitchat) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను కేసీఆర్‌ (KCR)కు రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావు (Santhosh Rao)అని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ అధినేతకు వాళ్ల అవినీతి గురించి చెప్పానని అన్నారు. ఇప్పటి వరకు హరీశ్ రావు, సంతోష్ రావు గ్యాంగులతో అంతర్గతంగా పోరాడానని.. ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు వచ్చి పోరాడతానని స్పష్టం చేశారు. తన దగ్గర చాలా సమాచారం ఉందని.. ఒక్కొక్కటిగా అన్ని బయటపెడతానని తెలిపారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అవినీతిపై తనకు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమాచారం ఇచ్చారని, జనగామ టికెట్‌పై ఇద్దరూ గొడవ పడ్డారని గుర్తు చేశారు. అందుకే పల్లా, పోచంపల్లి అవినీతిపై తనకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే.. బీఆర్ఎస్ (BRS) నేతలంతా ఇబ్బంది పడతారని తెలిపారు. భవిషత్తుపై తన దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగే ప్రతి విషయం కాంగ్రెస్ నేతలకు తెలుస్తోందని కవిత ఆరోపించారు.

Next Story