మళ్ళీ వస్తా.. నిధులు ఇస్తా..!

by Taduka Kalyani |   (  Updated:2026-04-06 15:41:45  IST  )

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హాజరయ్యారు.

మళ్ళీ వస్తా.. నిధులు ఇస్తా..!
X

దిశ,ఆదిలాబాద్ : రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హాజరయ్యారు. ముందుగా ఆదిలాబాద్ కు రూ.1238 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో గత పాలకులు చేయని పనులు చేస్తున్నామన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక ఎంత సేపు బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ గడీల పాలన, రాక్షస పాలన రానివ్వమని 2030 లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అక్రమ అరెస్ట్ లు,నిర్బంధాల సంస్కృతి కొనసాగిందన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తేనే ప్రజా ప్రభుత్వం వచ్చిందని అందుకే ప్రజా పాలన సంబరాలు చేసుకుంటున్నామన్నారు. ఎన్నికల వరకే రాజకీయమని, మేము రాజకీయ ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదన్నారు. తెలంగాణ అంటేనే దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా..

ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటానని నిధులు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో పీపుల్స్ మార్చ్ ఇక్కడ మొదలై ఖమ్మంలో విజయవంతంగా ముగిసిందన్నారు. గతంలో తాను గూడాలలో తిరిగినప్పుడు గమనించిన సమస్యలను ఇచ్చిన హామీలను ప్రస్తుతం ఒక్కొక్కటిగా నెరవేరిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో అందరికీ విద్యా, వైద్యం అందాలని,2030 లోపు ఆదిలాబాద్ జిల్లాను అత్యంత అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు. ఇక్కడ అపారమైన ఖనిజ,వనరుల సంస్కృతి సంపదలున్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రూ.1238 కోట్లతో అభివృధి పనులు ప్రారంభించామన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని,సాగు నీటి సమస్యను ప్రస్కరిస్తామన్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ల సహకారంతో ఎయిర్ పోర్ట్ కోసం కృషి చేశామని, జూన్ 2న ఎయిర్ పోర్ట్ పనులకు శిలాఫలకం వేసి పనులు ప్రారంభిస్తామన్నారు.అదేవిధంగా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామని, యూనివర్సిటీ ఏర్పాటు కోసం త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. బాసర ఆలయ అభివృద్ధి కోసం రూ.225 కోట్లు మంజూరు చేశామన్నారు. దేశంలోనే బాసర ఆలయాన్ని గొప్ప ఆలయంగా తీర్చి దిద్దుతామన్నారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ అభ్యర్థన మేరకు ఆలయానికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. నిర్మల్ లో యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేస్తామన్నారు. మళ్ళీ 2 నెలలకు ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వస్తానన్నారు.

మేము పాలకులం కాదు సేవకులం..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

రాష్ట్రంలో మేము పాలకులం కాదని సేవకులం మాత్రమే నేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రి సభలో ఆయన మాట్లాడారు..పిప్రి నుంచి చేపట్టిన పాదయాత్రలో అన్ని సమస్యలను తెలుసుకున్నానని పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకే సీఎం సూచన మేరకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది రాజకీయ సభ కాదని ఆనాటి ప్రజలతో మమేకమైనటువంటి అనుబంధం ఆత్మీయత కోసం ఈ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1238 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిందన్నారు. హామీలు నెరవేర్చడమే నిజమైన ప్రజా పాలన అన్నారు. గతంలో నాయకులు ఇచ్చిన హామీలు మరిచిపోయారని, కానీ సీఎం రేవంత్ ప్రభుత్వంలో అన్ని హామీలు నెరవేరుస్తున్నామన్నారు. 99 శాతం గ్యారెటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కోటి మందిని కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఇందిరమ్మ భరోసా,ఇందిరమ్మ బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు.ఈ రాష్ట్రంలో పుట్టడం, పెరగడం అదృష్టంగా భావించేలా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు.రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఖాళీ కడుపుతో పాఠాలు చదువుకొవద్దనే ఉద్దేశ్యంతో అల్పాహారం,మధ్యాహ్న భోజనం చేపట్టామన్నారు. ప్రజల చేత పాలించబడే ప్రభుత్వమన్నారు.తెలంగాణలో పుట్టడం అదృష్టంగా భావించేలా చేస్తామన్నారు.

ప్రజల కలలు నెరవేర్చేలా ప్రభుత్వం కృషి : ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ఆదిలాబాద్ లో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్య,ఉపాధి రంగంలో అభివృద్ధి చేసేందుకు వచ్చే 8 ఏళ్లలో ప్రజల కలలు నెరవేర్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుతం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు.కేస్లాపూర్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.త్వరలో విమానాశ్రయం పనులు కూడా ప్రారంభిస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో 100 పైన సీట్లు సాధిస్తాం : టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్

వచ్చే ఎన్నికల్లో 100 పైన సీట్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.ఆనాడు ఇక్కడ పాదయాత్ర చేపట్టి ప్రజల గోడు విన్న భట్టివిక్రమార్కకు అభినందనలు తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ పార్టీ అని రాబోయే ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి..: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.సీఎం అంటే రాష్ట్రానికి తండ్రి లాంటివాడని మా నియోజవర్గ సమస్యలు తీర్చాలని అన్నారు.బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని,సాగు నీటి సమస్యలను పరిష్కరించాలన్నారు.అదేవిధంగా భీంపూర్ మండలం జందాపూర్ కరంజి రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.మండల కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయని కొత్త భవనాలు కేటాయించాలన్నారు.బోథ్ లో డిగ్రీ కళాశాల,మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరారు.టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని,2000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు.

Next Story