- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2029 ఎన్నికల్లో పోటీ చేస్తాను : Kalvakuntla Kavitha
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేసారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేసారు. అయితే సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఎక్స్ వేదికగా హ్యాష్ ట్యాగ్ ఆస్క్ కవిత పేరుతో క్వశ్చన్ అవర్ నిర్వహిస్తున్నానని కవిత ముందుగానే అనౌన్స్ చేసారు. అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయిన క్వశ్చన్ అవర్ లో " మీ కొత్త పార్టీ పేరు ఏంటి?" అని ఓ నెటిజన్ అడగగా.. ఎలా ఉండాలో చెప్పమని కవిత బదులిచ్చారు.
త్వరలోనే జాగృతిని గ్రామాలకు విస్తరిస్తానని, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తాను 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటానని తెలిపిన కవిత.. జాగృతి ఎన్నికల బరిలో నిలువబోతోందని హింట్ ఇచ్చారు. 2047 నాటికి నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే తన విజన్, తన మిషన్ అని కవిత పేర్కొన్నారు.
Next Story






