కావాలంటే ఒవైసీకి ఫ్లైట్ టికెట్ నేను తీస్తా.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఇరాన్ నేత మృతిపై అర్ధరాత్రి నగరంలో జరిగిన ర్యాలీలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలంటే ఒవైసీకి ఫ్లైట్ టికెట్ నేను తీస్తా.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధ సెగలు భాగ్యనగరానికి తగిలాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతికి నిరసనగా హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ మహారాష్ట్రలో మాట్లాడుతూ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ లక్ష్యంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దేశ నాయకుడు చనిపోతే హైదరాబాద్ వీధుల్లో ర్యాలీలు నిర్వహించడం ఏంటని రాజాసింగ్ ప్రశ్నించారు. మన దేశానికి సంబంధం లేని విషయాల్లో ఇక్కడ నిరసనలు తెలపడం సరికాదన్నారు. ఓవైసీకి ఇరాన్ అంటే అంత అభిమానం ఉంటే, ఇక్కడ ర్యాలీలు చేయడం మానేసి నేరుగా ఇరాన్‌కు వెళ్లి అక్కడి సైన్యంతో కలిసి యుద్ధం చేయాలని సెటైర్లు వేశారు. కావాలంటే ఓవైసీకి అయ్యే ఫ్లైట్ టికెట్ ఖర్చులన్నీ తానే భరిస్తానని రాజాసింగ్ ఎద్దేవా చేశారు.

ఇరాన్‌కు అనుకూలంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్న వారిని గుర్తించి, వారిని వెంటనే దేశం నుంచి ఇరాన్‌కు పంపించేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే, పశ్చిమాసియా సంక్షోభం వేళ హైదరాబాద్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు, ఎంఐఎం ర్యాలీలు, నేతల మధ్య మాటలు అత్యంత సవాలుగా మారాయి.

Next Story