- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తా.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
జస్టిస్ పి చంద్రఘోష్ (Justice P Chandraghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఇచ్చిన నోటీసులను అందుకున్న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు విచారణ నిమిత్తం కాసేపట్లో హాజరుకాబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జస్టిస్ పి చంద్రఘోష్ (Justice P Chandraghosh) నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఇచ్చిన నోటీసులను అందుకున్న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు విచారణ నిమిత్తం కాసేపట్లో హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దురుద్దేశంతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విచారణకు ఆదేశించిందని ఆరోపించారు. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.
తమపై కక్ష తీర్చుకునేందుకు కాళేశ్వరాన్ని పడావు పెట్టి రైతులకు అన్యాయం చేయొద్దని.. రాజకీయాల కోసం తెలంగాణ నీటి హక్కులను కాల రాయొద్దని కామెంట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కల్పతరువులాంటిదని అన్నారు. అదేవిధంగా కమిషన్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం తాము ప్రభుత్వంలోనే లేమని.. కాబట్టి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను వారికి అందజేస్తామని పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణాలకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను కూడా కమిషన్‌కు అందజేస్తానని అన్నారు. న్యాయ వ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉన్న పార్టీ బీఆర్ఎస్ (BRS) అని అన్నారు. ఆరోపణల నిగ్గు తేలి మాకు న్యాయం జరుగుతుందని హరీశ్ రావు అన్నారు.






