- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ex MLA Bhikshamayya Goud : నన్ను అక్రమంగా హౌజ్ అరెస్టు చేశారు : మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(Brs Party Office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడుల(Congress Attack) ను నిరసిస్తు ఈ రోజు ప్రజాస్వామికయుతంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నన్ను అక్రమంగా హౌజ్ అరెస్టు(House Arrest) చేశారంటూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్(Ex MLA Bhikshamayya Goud) ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(Brs Party Office)పై కాంగ్రెస్ కార్యకర్తల దాడుల(Congress Attack) ను నిరసిస్తు ఈ రోజు ప్రజాస్వామికయుతంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నన్ను అక్రమంగా హౌజ్ అరెస్టు(House Arrest) చేశారంటూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్(Ex MLA Bhikshamayya Goud) ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు.
భువనగిరిలో తలపెట్టిన ధర్నాకు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారని, తెలంగాణలో ఎనుముల రాజ్యాంగం అమలౌతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరుపునా మేం పోరాడుతుంటే..ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే ప్రతిపక్ష నాయకులను అణిచివేత ధోరణితో అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. పోలీసులు, ప్రభుత్వం చర్య అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ప్రజా సమస్యలపైన, ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంచడాన్ని జీర్ణించుకోలేకనే ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అణిచివేత చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.






