నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు.. మీడియాతో మాట్లాడుతూ మంగ్లీ కంటతడి

by Prasad Jukanti |   (  Updated:2026-04-12 11:46:07  IST  )

మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో తనపై వచ్చిన ఆరోపణలను సింగర్ మంగ్లీ కొట్టిపారేశారు. అడ్వకేట్ సుబ్బారావు తనను డబ్బు డిమాండ్ చేశారని రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు.

నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు.. మీడియాతో మాట్లాడుతూ మంగ్లీ కంటతడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో (Micro Finance Scam) సింగర్ మంగ్లీ (Singer Mangli) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు (Advocate Subba Rao) నన్ను డబ్బు డిమాండ్ చేశారని డబ్బు ఇవ్వనందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని, బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఫేమస్ కావాలని చూస్తున్నారని ఆరోపించారు. మైక్రో ఫైనాన్స్‌ పేరిట రూ.10కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పంజాగుట్ట పీఎస్‍కు వచ్చిన మంగ్లీ.. న్యాయవాది సుబ్బారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దేనికైనా సిద్ధం:

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంగ్లీ.. నా పేరుతో ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారంటే అవన్నీ తనకు తెలియడానికి నేనైమైనా దేవతనా అని ప్రశ్నించారు. నేను మామూలు మనిషినే అన్నారు. తనకు విషయం తెలియగానే బాధితులకు న్యాయం చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మూలాలను మర్చిపోలేనన్నారు. నాకు డబ్బు ముఖ్యం కాదని డబ్బే ముఖ్యం అనుకుంటే 2023 తెలంగాణలో, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తనకు రాజకీయ ప్రచారం చేస్తే కోట్లకు కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినా నేను వాటిని తిరస్కరించానన్నారు.

కంటతడి:

తనకు పాటలు పాడడం మాత్రమే తెలుసని తన ప్రపంచం అదేనని చెప్పారు. తనకు డబ్బు కాదు వ్యక్తిత్వం ముఖ్యం అన్నారు. ఎవరినో చూపిస్తూ తన తమ్ముడు అని ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంతో తన పాత్ర లేదని ఒక వేళ ఉందని తేలితే అందుకు నేను దేనికైనా సిద్ధం, కానీ ఈ కేసులో నా ప్రమేయం లేదని తేలితే సుబ్బారావును ఏం చేస్తారని మీడియాను ప్రశ్నించారు. మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున పోరాడతానన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగ్లీ కంటతడిపెట్టుకున్నారు. సోషల్ మీడియా నాకు శాపంగా మారుతుందని ఏనాడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తనను నిందించడం సరికాదని భావోద్వేగానికి గురయ్యారు.

Next Story