నాకు క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యలాంటి అమ్మాయే కావాలి.. మంకుపట్టు పట్టిన యువకుడు

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-03-13 02:29:31  IST  )

భారత క్రికెటర్ భార్య కట్టు, బొట్టును చూసి.. అసలు పెళ్లంటే అలాంటి అమ్మాయినే చేసుకుంటానని ఓ నెటిజన్ మంగమ్మ శపథం చేశాడు.

నాకు క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యలాంటి అమ్మాయే కావాలి.. మంకుపట్టు పట్టిన యువకుడు
X

సెలబ్రిటీలు అంటే సగం బట్టలే ఉంటాయని ట్రోల్స్ చేస్తుంటారు. కానీ భారత క్రికెటర్ భార్య కట్టు, బొట్టును చూసి.. అసలు పెళ్లంటే అలాంటి అమ్మాయినే చేసుకుంటానని ఓ నెటిజన్ మంగమ్మ శపథం చేశాడు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అందమైన చీరకట్టులో మెరిసిపోయిన ఆమె ఫొటోలను చూసిన యువకుడు.. భార్య అంటే ఇలాగే ఉండాలని పట్టుబడుతున్నాడు. నాకూ అలాంటి భార్యే కావాలంటున్నాడు. ఇంతకూ ఆ సౌందర్యవతి ఎవరో మీరు చూడండి.

ఎనకటికి ఒకామె ‘ముచ్చట సంబురానపడి మొగణ్ని మర్చిపోయిందట’. అలాగే ఉంది ఈవిడతీరు. పార్క్‌కు వచ్చిన మహిళ.. సెల్ ఫోన్‌లో సొల్లు ముచ్చట్లలో పడి బిడ్డను వదిలేసి పోయింది. ఓ దయగళ్ల మారాజు గట్టిగా కేకలు వేసి మరీ బిడ్డను అప్పగించాడు. ఈ సొల్లు తల్లి గురించి మీరూ తెలుసుకోండి

నిన్నగాక మొన్న మహిళా దినోత్సవం జరుపుకున్నామో లేదో.. అప్పుడే ఈ ఆడక్కలు అదిరిపోయే శుభవార్త విన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సారే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎకాఎకిన 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని చెప్పకనే చెప్పారు. ఇంతమంది ఒకేసారి వస్తున్నారంటే ఏదన్న మీటింగ్ అనుకునేరు. కానే కాదు.. అసలు వాళ్లు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో తెలుసుకుందాం రండి.

వాట్సప్ వినియోగం పెరిగిపోయాక.. మోసాలు అంతే హైస్థాయికి చేరాయి. లింక్ ఓపెన్ చేస్తే నగ్న వీడియోలు, ఆన్ లైన్ చోరీలు. ఇక ఆఫర్లు అంటూ అందినకాడికి దండుకోవడం. ఇదే నేటి సోషల్ మీడియా తీరు. తాజాగా మీషో ఆఫర్స్ అంటూ లక్షల రూపాయలను కొట్టేశారు. కేవలం ఎనాలప్ కవర్ సాయంతో సైబర్ నేరానికి పాల్పడిన తీరు విస్మయానికి గురి చేసింది. ఈ కొత్తరకం దోపిడీ గురించి మీరు తెలుసుకోండి.

ఏడాది తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ బయటకు వచ్చారు. ఆయన ఎంట్రీతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వస్తున్నట్లుంది. ఎహే.. నాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు.. కాంగ్రెస్ పార్టే ముద్దు అని గులాబీ తోట నుంచి హస్తం అందుకున్న ఎమ్మెల్యే.. ఇవాళ కేసీఆర్ సార్‌ను కలిసి ముచ్చట్లు వేశాడు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని చెబుతూనే మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ పార్టీ వాళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. మరి అటూ ఇటూ జంప్ అవుతున్న ఎమ్మెల్యే ఎవరో మీరూ తెలుసుకోవాలి కదా.. మరి ఎందుకు ఆలస్యం.. రండి!

Next Story