- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా ఇబ్బందులన్నీ వాళ్లకు చెప్పేశా.. మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
తోటి మంత్రులతో వివాదం, తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha), కూతురు సుస్మితతో కలిసి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: తోటి మంత్రులతో వివాదం, తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha), కూతురు సుస్మితతో కలిసి ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ తనపై జరగుతోన్న కుట్రలను మీనాక్షి నటరాజన్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది. తనను, కుటుంబాన్ని, తన మనుషులను ఎవరెవరు ఎలా ఇబ్బందులు పెడుతున్నారో ఏకరువు పెట్టినట్లుగా సమాచారం. బీసీ మహిళలను అయిన తనను ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నారో మీనాక్షికి వివరించి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పి మంత్రి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తోటి మంత్రులతో తాను పడుతోన్న ఇబ్బందులు, ఆలోచనలు మీనాక్షి నటరాజన్‌కు తెలిపానని అన్నారు. వారు కూడా తన అభ్యర్థనను విని మంత్రులతో కూర్చొని మాట్లాడి త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నా బాధలు అన్ని వారితో పంచుకున్నానని, వాళ్లు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను ముందుకు వెళ్తానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.






