నేను ఇంగ్లీషులో చదివాను.. నాలాగా అందరూ ఇంగ్లీషులో మాట్లాడాలి

by Elthuri vijay kumar |

కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా రంగానికి పెద్దపీట : రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు

నేను ఇంగ్లీషులో చదివాను.. నాలాగా అందరూ ఇంగ్లీషులో మాట్లాడాలి
X

నేను ఇంగ్లీషులో చదివాను.. నాలాగా అందరూ ఇంగ్లీషులో మాట్లాడాలి

- కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా రంగానికి పెద్దపీట

- రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు

- మహాముత్తారం మండలంలో కేజీబీవీ జూనియర్ కళాశాల భవనం ప్రారంభం

దిశ, భూపాలపల్లి : నేను చిన్నప్పుడు పట్టణంలో ఉండి ఇంగ్లీష్ మీడియంలో చదివి, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాను. నాలాగే మంథని నియోజకవర్గంలోని విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడాలని ఉన్నత చదువులు చదివి పైకి రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. మహాముత్తారం మండలంలో రూ.2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీబీవీ జూనియర్ కళాశాల భవనాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు తమ కాళ్ళపై తాము నిలబడాలనే సంకల్పం కలిగి ఉండాలని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ చదువుకుంటే గ్రామం బాగుపడుతుందని తద్వారా రాష్ట్రం దేశం విద్యాపరంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కేజీవీబీ పాఠశాలలో విద్యార్థులకు టీ ఫైబర్ ద్వారా ల్యాప్ టాప్ లు అందజేస్తామన్నారు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల నియామకం పూర్తిచేసి ఖాళీగా ఉన్న పాఠశాలలో టీచర్ల నియామకం చేపట్టామని అంతేగాక గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం కాస్మోటిక్ ఛార్జీలు పెంచి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో 70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల, 72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ.పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఈ.జి.ఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కోట రాజా బాపు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని నిర్మల సమ్మయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Next Story