నేను చేసిన తప్పేందో చెప్పాలి.. కాంగ్రెస్ నాయకురాలు సునీతా రావు

by Kema Shiva Kumar |

తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు (Sunitha Rao)కు ఆలిండియా కాంగ్రెస్ మహిళా కమిటీ (All India Women's Congress Committee) ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసి విషయం తెలిసిందే.

నేను చేసిన తప్పేందో చెప్పాలి.. కాంగ్రెస్ నాయకురాలు సునీతా రావు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు (Sunitha Rao)కు ఆలిండియా కాంగ్రెస్ మహిళా కమిటీ (All India Women's Congress Committee) ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ చేసి విషయం తెలిసిందే. పార్టీ పదవులు విషయంలో ఆమె ఇటీవలే కొంతమంది మహిళా నేతలతో కలిసి గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ (Mahesh Kumar Goud) చాంబర్ ఎదుట బైఠాయించిన విషయంలో అధిష్టానం సీరియస్ అయింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆల్కాలాంబా, సునీతా రావుకు షోకాజు నోటీసులు జారీ చేసి వారంలోగా సమాధానం ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు.

ఈ క్రమంలోనే ఇవాళ సునీతా రావు గాంధీభవన్‌ (Gandhi Bhavan)కు వెళ్లారు. అక్కడ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావు‌ (Kumar Rao)తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆలిండియా కాంగ్రెస్ మహిళా కమిటీ నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి షోకాజు నోటీసు అందలేదని అన్నారు. ఒకవేళ నోటీసు వస్తే మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలు చెబుతానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan)ను కలిస్తే ఆమె పీసీసీ చీఫ్‌ను కలవమన్నారని పేర్కొన్నారు. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అసలు తాను చేసిన తప్పేందో పార్టీ పెద్దలే చెప్పాలని సునీతా రావు ప్రశ్నించారు.

Next Story