- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి చిటికన వేలు పట్టుకుని ఉద్యమాలు నేర్చా.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: జన్మనిచ్చిన తండ్రి కేసీఆర్ చిటికన వేలు పట్టుకుని ఉద్యమాలు చేయడం చేర్చుకున్నానని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె జూబ్లిహిల్స్‌లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘జై తెలంగాణ.. జై జాగృతి’ అని నినాదం చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముందుగా ఆమెపై బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్‌ను చదవి వినిపించారు. నిన్న మధ్యాహ్నం బీఆర్ఎస్ నుంచి ప్రకటన విచ్చిందని, తాను ప్రవర్తిస్తున్న తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో సస్పండ్ చేశారట అని కామెంట్ చేశారు. లేఖలో రెండు అంశాలపై తాను మాట్లాడతానని అన్నారు. తాను తిహార్ జైలు నుంచి వచ్చాక గురుకులాల్లో పరిస్థితులపై అనేక పోరాటాలు చేశానని అన్నారు. బనకచర్లపై రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎం జిల్లాలో భూ నిర్వాసితులకు అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. పెన్షన్లు పెంచాలని.. ఆడబిడ్డలకు ఆర్థిక సాయంపై పోర్టు కార్డు ఉద్యమం చేశానని అన్నారు. నవంబర్ నుంచి 47 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేశారని అన్నారు. గులాబీ కుండువా కప్పుకుని చేస్తే పార్టీకి ఎలా వ్యతిరేకం అవుతోందని కవిత ప్రశ్నించారు.
భవిష్యత్తులో KTR, KCRలపై ఇలాంటి కుట్రలే జరగొచ్చు..
పార్టీలో ఇద్దరు పని గట్టుకుని తపై విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు గుప్పించారు. హరీశ్‌రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదని కామెంట్ చేశారు. చెల్లి, మహిళా ఎమ్మెల్సీపై ఆఫీసులో కుట్ర జరగుతోందని అన్న కేటీఆర్‌కు చెప్పానని.. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం తనను అడక్కపోవడం దారుణమని అన్నారు. బంధుత్వం పక్కన పెట్టి ఓ మహిళా ఎమ్మెల్సీని బాధపడుతుంటే అన్నగా కేటీఆర్ ఏం చేయలేదని ఆరోపించారు. కేవలం వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి తనను బయటకు పంపారని ధ్వజమెత్తారు. రేపు కేటీఆర్, తన తండ్రిపై ఇంటాంటి కుట్రలే జరగొచ్చని కవిత కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
వాళ్లు మెకవన్నె పులులు..
బీఆర్ఎస్ పార్టీని కొందరు తమ హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డితో కలిసి ఇదే హరీశ్ రావు ఒకే విమానంలో ప్రయాణించలేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యాకే తనపై కుట్రలు మొదలయ్యాయని అన్నారు. హరీశ్ రావుపై ఆరోపణలు ఒక్కరోజు మాత్రమే మీడియాలో వస్తాయని.. రెండో రోజు ఆయనపై ఎవరూ అభియోగాలు చేయరని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి, హరీశ్ రావు గురించి అసలే మాట్లాడటం లేదని ఇక్కడే వాళ్ల లాలూచీ బయటపడుతోందని అన్నారు. పార్టీలో ఏం జరుగుతోందో చూడండి నాన్న.. హరీశ్ రావు, సంతోష్ రావు పార్టీలో మెకవన్నె పులులు అని చెప్పినా కేసీఆర్ వినిపించుకోవడం లేదని కవిత అన్నారు.
హరీశ్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్
హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదని.. బబుల్ షూటర్ అని కవిత ఆరోపించారు. ట్రబుల్ క్రియేట్ చేసి దానిని సాల్వ్ చేసినట్లుగా చెప్పుకుంటారని తెలిపారు. 2018 ఎన్నికల్లో25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల ఫండింగ్ ఇచ్చారని అన్నారు. ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం అంతా తనకు స్పష్టంగా తెలుసని అన్నారు. ఇక సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించేందుకు రూ.60 లక్షలు పంపారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌కు ఏమైనా జరగాలని కోరుకునే వ్యక్తిని తాను కాదన్నారు. తనకు వారిపై ఎందుకు కోపం ఉంటుందని అన్నారు. కోట్లలో ఒకరికి ఉండే తండ్రి తనకు దొరికిండని కవిత ఎమోషనల్ అయ్యారు.






