Amrutha : ఇకనైనా పరువు హత్యలు ఆగుతాయని ఆశిస్తున్నాను : అమృత

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువుహత్య(Pranay Murder Case) కేసులో సోమవారం కోర్టు కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Amrutha : ఇకనైనా పరువు హత్యలు ఆగుతాయని ఆశిస్తున్నాను : అమృత
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువుహత్య(Pranay Murder Case) కేసులో సోమవారం కోర్టు కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఒకరికి ఉరిశిక్ష విధించగా, మరో ఆరుగురికి నల్గొండ కోర్టు జీవితఖైదు విధించింది. అయితే ఈ హత్యలో మరణించిన ప్రణయ్ భార్య అమృత(Amrutha) కోర్టు తీర్పు అనంతరం మీడియా ముందుకు వచ్చారు. ప్రణయ్ రూపంలో తన బిడ్డ సంతోషంగా పెరుగుతున్నాడని.. బాబు భవిష్యత్తును తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నానని ఓ వీడియో విడుదల చేసింది. ఇన్నేళ్ల ఎదురుచూపుల అనంతరం తమకు న్యాయం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ తీర్పుతోనైనా పరువు హత్యలు ఆగుతాయని ఆశిస్తున్నానని తెలిపింది.

ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన పోలీసులు, న్యాయశాఖ, ప్రభుత్వాలకు, సన్నిహితులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా తమ కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడని ప్రణయ్ అనే యువకుడిని మిర్యాలగూడకు చెందిన మారుతీరావు(MaruthiRao) 2018 సెప్టెంబర్ 14న సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఈ కేసులో 2019లో 8 మందిపై ఛార్జిషీట్ నమోదు చేయగా.. వారిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. మిగతా ఏడుగురిలో ఒకరికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్ట్ సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది.

Next Story