Jukkal MLA Laxmikanta Rao : నేను గత మూడు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నా : జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకంతా రావు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-03 11:33:02  IST  )

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy) ఫామ్ హౌస్(Farmhouse)లో కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేల(10 MLAs) రహస్య భేటీ(Secret Meeting) జరిగినట్లుగా..ఈ భేటీలో తాను కూడా పాల్గొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు(Jukkal MLA Laxmikanta Rao)తీవ్రంగా ఖండించారు(

Jukkal MLA Laxmikanta Rao : నేను గత మూడు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నా : జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకంతా రావు
X

దిశ, వెబ్ డెస్క్ : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Jadcharla MLA Anirudh Reddy) ఫామ్ హౌస్(Farmhouse)లో కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన 10మంది ఎమ్మెల్యేల(10 MLAs) రహస్య భేటీ(Secret Meeting) జరిగినట్లుగా..ఈ భేటీలో తాను కూడా పాల్గొన్నట్లుగా జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు(Jukkal MLA Laxmikanta Rao)తీవ్రంగా ఖండించారు(Denied). ఢిల్లీ ఇందిరా భవన్ ఏఐసీసీ కార్యాలయం ముందు నిలుచుని మాట్లాడిన లైవ్ వీడియో(Live video)ను ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.

తాను ఎవరితోనూ రహస్యాంగా భేటీ కాలేదని..ఏ రహస్య సమావేశానికి హాజరుకాలేదని వీడియోలో లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. నేను గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నానని, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రితో, అధికారులను కలవడం జరిగిందన్నారు. అలాగే మూడు రోజులుగా కాంగ్రెస్ ప్రముఖులను కలిశానని..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ చౌదరి ప్రచారంలో, ప్రియాంక గాంధీ నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నానని, ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో దూసుకెలుతుండటం..ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ సోషల్ మీడియా మాపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. జడ్చర్ల రహస్య భేటీకి హాజరైనట్లుగా నాపై తప్పుడు వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు.

అయితే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫామ్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ 10మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారని..వారు ఓ మంత్రికి వ్యతిరేకంగా ఈ సమావేశం పెట్టుకున్నారని జరిగిన ప్రచారం రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. నిజానికి ఈ భేటీ జరిగిందా...జరిగితే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారు..భేటీ లక్ష్యం ఏమిటి..దాని వెనుక ఎవరున్నారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రహస్య భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్ , కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రావు, దొంతి మాధవ్, బీర్ల ఐలయ్య యాదవ్ లు హాజరైనట్లుగా ప్రచారం జరిగింది.

అయితే తాను ఎలాంటి రహస్య భేటీకి హాజరుకాలేదని..మూడు రోజులుగా తాను ఢిల్లీలోనే ఉన్నానని లక్ష్మీకాంతా రావు ప్రకటించిన నేపథ్యంలో రహస్య భేటీ వార్తల ప్రచారంలో నిజానిజాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల జరుగనుండటం..నిన్ననే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేను కొడితే గట్టిగా కొడుతానంటూ హెచ్చరికలు చేసిన రోజునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు సహజంగానే సర్వత్రా ఆసక్తి రేపాయి.


Click Here Tweet..

Next Story