Sabitha Indrareddy : కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కాను : సబితా ఇంద్రారెడ్డి

by Muthe.Rajitha |

ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు(Final Judgement) వెలువడిన విషయం తెలిసిందే.

Sabitha Indrareddy : కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కాను : సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు(Final Judgement) వెలువడిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో ఐదుగురిని దోషులుగా.. ఇద్దరిని నిర్దోషులుగా కోర్ట్ ప్రకటించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. వీరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(BRS MLA Sabitha Indrareddy), రిటైర్డ్ IAS కృపానందంను నిర్దోషులుగా తేల్చింది.

కాగా ఈ కేసు తుది తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ కేసులో తాను 12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కినట్టు గుర్తు చేసుకొని ఆవేదన చెందారు. ఈ 12 ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కున్నట్టు పేర్కొన్నారు. కేసుల నెపంతో తనను రాజకీయంగా అణచివేయాలనుకున్నారని.. అవినీతి చేశానని, జైలుకు పోతానని హేళన చేశారని సబితారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తాను న్యాయవ్యవస్థను నమ్మానని, చివరికి తనకి న్యాయం జరిగిందన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story