Chandrababu: హైదరాబాద్ పై రాజకీయం మాట్లాడను.. ఏమైనా అంటే ఎటాక్ చేస్తారు: చంద్రబాబు

by Prasad Jukanti |

హైదరాబాద్ పరిపాలనపై ఏపీ సీఎం హాట్ కామెంట్స్ చేశారు.

Chandrababu: హైదరాబాద్ పై రాజకీయం మాట్లాడను.. ఏమైనా అంటే ఎటాక్ చేస్తారు: చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పరిపాలన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై తాను మాట్లాడితే రేపు వాళ్ళు నాపై ఎటాక్ చేస్తారు. అది డిఫరెంట్ ఇష్యూ అన్నారు. తాజాగా రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌కు హాజరైన చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను (Hyderabad) పరిపాలిస్తున్న తీరుతో మీరు సంతోషంగా ఉన్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన చంద్రబాబు.. పై విధంగా వ్యాఖ్యానించారు. అయితే హైదరాబాద్ అభివృద్ధి కోసం బలమైన పునాదులు వేశామని చెప్పారు. నగర అభివృద్ధి కోసం బెస్ట్ ఎకో సిస్టం తీసుకువచ్చామని 25 ఏళ్ల క్రితం నేను ఒక హైటెక్ సిటీ (Hi-Tech City) బిల్డింగ్ స్టార్ట్ చేశాను. అది మొదటి ప్రారంభం. తర్వాత భారీగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించానన్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు, నియామకాలు చేపట్టడంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు మైగ్రేట్ అయ్యారన్నారు. ఇది నేను ఇవాళ గర్వాంగా చెప్పగలనన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్లినా 33 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులే తలసరి ఆదాయంలో ముందువరుసలో ఉన్నారని చెప్పారు.

నాటి నిర్ణయాలు ఇప్పుడు దేశానికి ఫలాలు:

హైదరాబాద్ లో 163 కిలోమీటర్ల ఎనిమిది లైన్లు కలిగిన ఓటర్ రింగ్ (ORR) రోడ్డును నేషనల్ హైవేస్ రిఫామ్స్ కంటే ముందు నేను తీసుకువచ్చాను. దేశంలోనే తొలిసారి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును (AIRPORT) తెచ్చాను. డబ్బులు చెల్లించకుండానే పాలసీ తీసుకురావడం ద్వారానే ఈ ఎయిర్ పోర్టును తీసుకురాగలిగానన్నారు. 2000 సంవత్సరం ప్రాంతంలో బయోటెక్నాలజీ పార్క్ ను ప్రారంభించాను. ఈ పార్క్ నుంచే కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది. భారత్ బయోటెక్ నుంచి వచ్చింది. అలాగే వందదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి ఇక్కడి నుంచే చేయగలిగింది. నేను ఈ పార్క్ ను ప్రారంభించినప్పుడు ప్రతిఒక్కరూ ఈ బయోటెక్ ఏంటి అని ప్రశ్నించారు. కానీ నేను ప్రారంభించిన ఆధునిక సాంకేతికతకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు దేశానికి అందుతున్నాయన్నారు.

2047 నాటికి ఇండియా నెంబర్ వన్:

ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నాయకత్వంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చంద్రబాబు చెప్పారు. ఇండియా 2047 నాటికి నంబర్ వన్ స్థానానికి చేరుతుందనని అమెరికాతో పోలిస్తే భారత్ జీడీపీ వృద్ధిరేటు బాగుందన్నారు.ప్రపంచ టెక్నాలజీలో ఇండియా వాళ్లదే కీలక పాత్ర అన్నారు. గతంలో ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ఏఐ వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నా అనేక లాభాలు ఉన్నాయన్నాయని చెప్పారు.

Next Story