పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు.. మర్రి జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-05 08:59:39  IST  )

వరుస విచారణతో గులాబీ పార్టీ పొలిటికల్‌గా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.

పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు.. మర్రి జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస విచారణలతో గులాబీ పార్టీ పొలిటికల్‌గా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)తో సహా ముఖ్య నేతలు హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) పలు కేసులతో సతమతవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలంతా తన రాజకీయ భవితవ్యంపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ (BJP)లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. దీంతో మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన ఇవాళ క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. కేసీఆర్‌ను మనిషి రూపంలో ఉన్న దేవుడిలా పూజిస్తానని అన్నారు. గువ్వల ఓడిపోతారని తెలిసినా.. అచ్చంపేట నుంచి కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. తాను కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారొద్దనే గువ్వల బాలరాజుకు చెప్పానని పేర్కొన్నారు. ఇక బీజేపీలో, బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది ప్రచారమేనని మర్రి జనార్దన్ రెడ్డ కొట్టి పడేశారు.

Next Story