నేను ఏ పార్టీలో చేరను, అది ఎప్పుడూ ఉండే ప్రచారమే! మందకృష్ణ మాదిగ

by Geesa Chandu |

నేను ఏ పార్టీలో చేరడం లేదని.. అది ఎప్పుడూ ఉండే ప్రచారమేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

నేను ఏ పార్టీలో చేరను, అది ఎప్పుడూ ఉండే ప్రచారమే! మందకృష్ణ మాదిగ
X

దిశ, వెబ్ డెస్క్: నేను ఏ పార్టీలో చేరడం లేదని.. అది ఎప్పుడూ ఉండే ప్రచారమేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనమంతా ఏకం కావాలని, అన్ని వర్గాలకు సమానంగా పోరాడాలని అన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఆపాలని, మాలల్లో అంబేద్కరిస్టులు లేరు కానీ వారు అంబేద్కర్ పేరు చెప్పుకుంటున్నారని అన్నారు. అయితే మాలల్లో ఒకటి రెండు శాతం వరకూ తనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చారు. మాలల్లో మనువాదులు పెరిగారని, వాళ్లు విప్లవాలు చేసినవారు కాదని పేర్కొన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని, అది ఎప్పుడూ ఉండే ప్రచారమేనని అన్నారు. ఇలాంటి ప్రచారం నిన్న మొన్నటి నుండి జరుగుతుంది కాదని, 1997 జూన్ లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని తెలిపారు. తాను ఎప్పటికీ ప్రజల మనిషినేనని, ప్రజల తరఫున పోరాటం చేయడానికే తాను ఉన్నట్లు తెలిపారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చాడు, రాజ్యసభ కూడా ఇస్తానన్నారు. అయితే తాను తిరస్కరించినట్లు చెప్పారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా తాను కాంగ్రెస్ లో చేరుతానని అనుకున్నారు. కానీ ఏ పార్టీలో చేరలేదని అన్నారు. ఎప్పటికీ తనది నల్ల కండువానే అని, అదే తన జీవితమని, దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టనని వెల్లడించారు. తాను ఇదివరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయానని, కానీ ఏ పార్టీలో కూడా చేరలేదని అన్నారు. స్వతంత్రంగా పోటీ చేసి గెలిచి, చట్ట సభల్లోకి వెళ్తాను కానీ ఏ పార్టీలో కూడా చేరబోనని, తన స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోనని మందకృష్ణ చెప్పుకొచ్చారు.

Next Story