- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా వెనకాల మొరిగేటోళ్లను పట్టించుకోను.. కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె చేపట్టిన ‘జాగృతి జనం బాట’పై వస్తున్న విమర్శలకు ఇవాళ నిజామాబాద్‌లో ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మనం పెంచి పోషించిన నాయకులు మనల్నే విమర్శించడం రాజకీయాల్లో కొత్తమీ కాదని అన్నారు. చేసేది సద్విమర్శ కావాలని.. ప్రజల పక్షాన పోరాటం చేసే విమర్శ కావాలన్నారు. పర్సనల్‌గా ఎటాక్ చేస్తే ప్రజలు ఎవర్నీ కూడా క్షమించబోరని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేస్తేనే బీసీ రిజర్వేషన్లు..
ప్రజల సమస్యలే తమ సమస్యలని.. వాటి కోసమే ప్రభుత్వంతో కొట్లాడుతున్నామని అన్నారు. ఆ దారిలోనే తాము జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేశారు. తమ వెనుక చాలా మంది మొరుగుతుంటారని.. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కవిత అన్నారు. నేను ఒక్కసారి కమిట్ అయితే.. నా మాట నేనే విననని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ తనకు సహరించలేదంటూ తానెక్కడ చెప్పలేదన్నారు. కానీ, తన సొంత నియోజకవర్గ పరిధిలోని నవీపేట్‌లో రైతులు నష్టపోతే.. కనీసం వారిని చూడదలేని, అదే షకీల్ నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. తన ఊరు కాబట్టే తాను ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాభించానని తెలిపారు. ఇవాళ నిజమాబాద్ రూరల్ నియోజకవర్గానికి వెళ్తున్నానని.. అక్కడ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని వివరించారు. పంట చేతికొచ్చే సమయానికి అటవీ శాఖ అధికారులు మంది చల్లి పంటను పూర్తి నాశనం చేయడం బాధకరమని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో మొదలుపెట్టి మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే దానంతట అవే బీసీ రిజర్వేషన్లు వస్తాయని కామెంట్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని.. చంద్రబాబు, నితీశ్‌కుమార్ మద్దతుతోనే అంతా నడుస్తోందన్నారు. రాష్ట్రంలోని బీజేపీ కోర్ మెంబర్ రాజీనామాలతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని కల్వకుంట్ల కవిత అన్నారు.
READ MORE ....
MP Arvind: రాష్ట్రమంతా తిరిగినా కవితకు 400 ఓట్లు రావు: ఎంపీ అర్వింద్






