Justice Sudarshan Reddy: నాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-08-19 09:46:49  IST  )

నాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Justice Sudarshan Reddy: నాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదు: జస్టిస్ సుదర్శన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏ రాజకీయ పార్టీలో నాకు సభ్యత్వం లేదని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రాజకీయ పార్టీతో ప్రమేయం లేని వ్యక్తి తమ అభ్యర్థిగా ఉండాలని ఇండియా కూటమి భావించి ఉండవచ్చని అందులో భాగంగానే నా పేరును ప్రతిపాదించి ఉండవచ్చన్నారు. తన అభ్యర్థిత్వంపై తనను అడాగరని అందుకు నేను అంగీకరించానని చెప్పారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తన పేరు ఖరారు చేసిన నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. సౌత్, నార్త్ ఇదంతా అర్థవంతమైనటువంటి చర్చ కాదన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అదరి మద్దతు అడుగుతాననిచెప్పారు.

Next Story