- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయం, ఆస్తుల కోసం నేను రాలేదు.. మాగంటి గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్నా తారక్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటి చేస్తున్న మాగంటి సునీత (Maganti Sunitha)కు తహసీల్దార్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడంపై మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మొదటి భార్య మాలిని దేవి (Malini Devi) అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటి చేస్తున్న మాగంటి సునీత (Maganti Sunitha)కు తహసీల్దార్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయడంపై మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మొదటి భార్య మాలిని దేవి (Malini Devi) అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారంటూ మాలిని తన కొడుకు కుమారుడు ప్రద్యుమ్నా తారక్ (Pradyumna Tarak)తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రద్యుమ్నా మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్‌కు అసలైన వారసులం తామేనని.. రాజకీయం, ఆస్తుల కోసం రాలేదని కామెంట్ చేశారు. ఎవరి కొడుకు అని అడిగితే నేనేం చెప్పుకోవాలని.. ఐడెంటిటీ కోసమే తమ పోరాటమని అన్నారు. తన తండ్రి మరణించే వరకూ తాను ఆయనతో టచ్‌లోనే ఉన్నానని పేర్కొన్నారు. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు రాకుండా మమ్మల్ని బెదిరించారని వెల్లడించారు. ఒకవేళ అక్కడికి వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయని, ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయొద్దని పువ్వాడ అజయ్ (Ajay Puvvada), మోహన్ ముళ్లపూడి తమకు చెప్పారని తెలిపారు. తనకు ప్రాణహానీ ఉండటంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని తారక్ ప్రద్యుమ్న మీడియాకు వివరించారు.






