- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే సీఎంను అయ్యా : రేవంత్ రెడ్డి
ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను ముఖ్యమంత్రిని అయ్యానని నా ప్రతి సభలో వారికి కుడివైపు సీటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు.

దిశ,మేడ్చల్ బ్యూరో : ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను ముఖ్యమంత్రిని అయ్యానని నా ప్రతి సభలో వారికి కుడివైపు సీటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించారు. ఆదివారం ఉప్పల్ బగాయతులో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆడబిడ్డలు వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు అన్నారు. ఆడబిడ్డలకు నా ప్రతి సభలో ముందు కూర్చునే అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహిళలు ఆశీస్సులతోనే జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానన్నారు. ఐదేళ్లు తిరిగినా మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పూర్తి కాదన్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ అంటే మినీ భారత దేశమని అన్నారు. కిందపడిపోయిన నన్ను మల్కాజ్ గిరి ప్రజలు ఆశీర్వదించి చేయూతన అందించారని అన్నారు. ఎంపీ కావడం వల్ల పీసీసీ అధ్యక్షుడిగా సోనియా గాంధీ నియమించి ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి, నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానమేనని గుర్తు చేసుకున్నారు. ఒక్క పైసా ఆశించకుండా ఆడబిడ్డలు నాకు ఓటు వేశారని వారిని కొనియాడారు. గత ప్రభుత్వ సహకారం లేకపోవడంలో మల్కాజ్ గిరి పార్లమెంటులో అభివృద్ధి సరిగా చేయలేకపోయానని అన్నారు. కాలం గిర్రున తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను.. హైదరాబాద్ లో నాలుగు రకాల పరిపాలన జరుగుతుండగా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి సరిగా జరగడం లేదని అన్నారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయల కల్పన కోసం విజన్ డాక్యూమెంట్ ను తీసుకువచ్చామన్నారు.
ఎన్నికల కోసం కాదు పరిపాలన సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు
తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో విజన్ డాక్యుమెంటును తీసుకువచ్చి క్రమపద్దతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల కోటి ముప్పై లక్షమంది నివసిస్తున్నారని వారికిమౌలిక సదుపాయలు , పరిపాలన సమన్వయం, మూసీ ప్రక్షాళన వంటి జరగాలంటే ప్రక్షాళన అవసరం అని భావించామని అందుకే క్యూర్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని కొందరు అంటున్నారు.. ఎన్నికల కోసం కాదు పరిపాలన సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించుకోవడం ఎంతో సంతోషం అన్నారు. పరిపాలనను వికేంద్రీకరించేందుకు పోలీస్ ,మున్సిపల్ శాఖ పరిధి ఒకేలా ఉండేలా చేశామన్నారు. 1600 కోట్ల పనులకు ఈ రోజు శంకుస్థాపనలు చేసుకున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం కోసం ఎన్ని నిధులైనా ఇచ్చే బాధ్యత నాదన్నారు. రోడ్లు, చెరువుల సుందరీకరణ, మెట్రో విస్తరణ ..ఏం కావాలన్న నేను చేస్తానని తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడుదాం.. అభివృద్ధి చేసుకుందాం.. సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బండారు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.. నిజంగా రాజకీయం చేస్తే ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ కు బండారు రాజిరెడ్డి పేరు పెట్టేవాన్ని కాదని అన్నారు. బండారు రాజిరెడ్డి ఉప్పల్ ప్రాంతానికి 40 యేళ్లు సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రెంట్ , ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేశారు. మేం మూసీ నది ప్రక్షాళన చేయోద్దా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా పని చేస్తా
గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల వరకు మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసుకుంటే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి,పర్యాటక ప్రాంతం గా మారుతుందని తెలిపారు. మూసీ మురికి కారణంగా ఇక్కడ భూముల రేట్లు పెరగడం లేదు, నల్గొండ జిల్లాలో మూసీ కాలుష్యం వల్ల ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ఆడబిడ్డలు కడుపుకోత కు గురౌతారని అక్కడి వాళ్లు బయటకు పంపుతున్నారని, మూసీ ప్రక్షాళన చేయమని నల్గొండ ప్రజలు నన్ను పిలిస్తే పాదయాత్ర చేశానని తెలిపారు. మూసీలో ఇళ్లు పోయిన వారికి ఇళ్లు ఇస్తాం, చదువు చెప్పిస్తామంటే అడ్డుపడుతున్నారు.. కేంద్ర మంత్రి గా ఉన్న వ్యక్తి ఈ రోజు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9 వ స్థానానికి పడిపోయింది అని తెలిపారు. మెట్రో ను విస్తరించడానికి అడ్డు పడుతున్నారన్నారు. మెట్రో విస్తరించాలన్న అవసరం ఉందా లేదా అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ప్రపంచంతోనే పోటీ పడే అవకాశం తెలంగాణకు ఉంటుందని అన్నారు. రెండున్నర యేళ్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కోసం యాభై సార్లు ఢిల్లీ వెళ్లా, మోదీని కలిశానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసింది.. మిగిలిన 25 లక్షలు ఎవరు కొనాలి, కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా అని సీఎం ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కలిసి వస్తానని అంటే కిషన్ రెడ్డి నన్ను కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకుపోవడం లేదని తెలిపారు. తుమ్మిడి హట్టి బ్యారేజీ నిర్మాణం పైన చర్చించడానికి ముందుకు రాకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకుని తిరుగుతున్నడు..దీనికి కారణంగా కిషన్ రెడ్డి అన్నింటికి సహకరిస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతామన్నారు. గతంలో కిషన్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు చేస్తే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దాం. కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుందా మన్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా పని చేస్తా.. అది నా బాధ్యత... రాజకీయాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఫేజ్ టూ లో మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు. వంద రోజుల్లో కార్యాచరణ మొదలవుతుందని సీఎం స్పష్టం చేశారు.






