- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నాను: ప్రధాని మోడీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక టీచర్, మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారంలో ఉన్న తెలంగాణ (Telangana)లో బీజేపీ (BJP) అనూహ్యంగా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక టీచర్, మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC) స్థానంలో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ విజయాలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా రెండు ఎమ్మెల్సీలతో తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన బీజేపీ అభ్యర్థుల సంఖ్య 21కి చేరుకుంది. ఇందులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు (Eight MLA), 8 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (MLC election results) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై భారీ ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు (Political analysts) అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ (BJP) రెండింట్లో విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్(Twitter) ఖాతాలో ఇలా ట్వీట్ చేశారు."MLC ఎన్నికల్లో బీజేపీకి అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కొత్తగా ఎన్నికైన మా అభ్యర్థులకు అభినందనలు. తెలంగాణ ప్రజల మధ్య ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్న మా పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను." అని రాసుకొచ్చారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ (Karimnagar Teachers MLC) స్థానంలో మల్క కొమురయ్య భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (Graduate MLC position)లో.. మూడు రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి (Anji Reddy) విజయం సాధించారు.






