KTR : స్టాలిన్ వాదనతో ఏకీభవిస్తున్నాం : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-26 07:51:02  IST  )

నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్(Stalin) చేసిన వాదన(Argument)తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని(Completely Agree)..ఆయనకు గట్టిగా మద్ధతు(Support)నిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు.

KTR : స్టాలిన్ వాదనతో ఏకీభవిస్తున్నాం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్(Stalin) చేసిన వాదన(Argument)తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని(Completely Agree)..ఆయనకు గట్టిగా మద్ధతు(Support)నిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా స్టాలిన్ చేసిన వాదనకు ఎక్స్ వేదికగా మద్ధతు తెలిపిన కేటీఆర్ దేశానికి అత్యంత అవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణను అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం జరిమానా విధించలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా డీలిమిటేషన్‌ను అమలు చేయడం ప్రజాస్వామ్యం లేదా సమాఖ్య స్ఫూర్తి కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.

కేంద్రం డీలిమిటేషన్‌ను అమలు చేయడానికి ఆసక్తిగా ఉంటే- దేశానికి ఆర్థిక సహకారం ఆధారంగా నేను డీలిమిటేషన్‌ (I Propose Delimitation Basing On The Fiscal Contributions)ను ప్రతిపాదిస్తానని చెప్పుకొచ్చారు. దేశ నిర్మాణానికి తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరన్నారు. ఇందుకు ఒక ఉదాహరణగా దేశ జనాభాలో తెలంగాణ కేవలం 2.8% మాత్రమే ఉండగా, అది దేశ జీడీపీ(GDP)లో 5.2% కంటే ఎక్కువగా అందిస్తుందని తెలిపారు.

అంతకుముందు స్టాలిన్ డీలిమిటేషన్, త్రిభాష విధానంపై కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం 2026లో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేయనుందని..ఇందుకు జనాభా ఆధారం చేసుకోవడం అభ్యంతరకరమని స్టాలిన్ స్పష్టం చేశారు.

మహిళా విద్య, ఆరోగ్య ప్రయత్నాలతో కొన్ని దశాబ్ధాలుగా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పథకాలను అమలు చేశాయని..దీంతో జనాభా తగ్గిందని..ఇప్పుడు లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశాడు. డీలిమిటేషన్ తో దక్షిణ భారత దేశంపైన కత్తి వేలాడుతుందని..లోక్ సభ స్థానాలు తగ్గనున్నాయని..తమ రాష్ట్రంలో 8స్థానాలు తగ్గడం ద్వారా తమకు అన్యాయం జరుగనుందని స్టాలిన్ పేర్కొన్నారు.

దీనికి వ్యతిరేకంగా మార్చి 5న ఆఖిల పక్ష భేటీ నిర్వహిస్తామని..ఎన్నికల కమిషన్ లో నమోదు చేసుకున్న 40పార్టీలను ఆహ్వానిస్తామని స్టాలిన్ ప్రకటించారు.

Next Story