- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైడ్రా చర్యలు భేష్.. చెరువుల పునరుద్ధరణ అద్భుతం
ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామం అని కర్ణాటక బృందం హైడ్రాను కొనియాడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామం అని కర్ణాటక బృందం హైడ్రాను కొనియాడింది. చెరువుల పునరుద్ధరణ పనులు ఎలా జరుగుతున్నాయని కర్ణాటకలోని బెంగళూరును సందర్శించిన హైడ్రా.. నెలల్లోనే మెరుగైన పనితీరుతో హైదరాబాద్‌లో ఫలితాలు సాధించిందని అభినందించారు. బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పాటు నగరంలో మొదటివిడతగా హైడ్రా పునరుద్ధరించిన పలు చెరువులను కర్ణాటకలోని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. అనంతరం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ. రంగనాథ్ ను కలిసి చెరువుల పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను.. వాటిని అధిగమించిన తీరును అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ జరుగుతున్న తీరును పరిశీలించిన హైడ్రా.. అనతికాలంలోనే ‘మేము ఇక్కడకు వచ్చి చూసేలా చెరువులను పునరుద్ధరించారు. బతుకమ్మకుంటను చూశాం.. ఆక్రమణలకు గురై.. నాడు ముళ్ల పొదలతో ఉన్న చిత్రాలను, వీడియోను చూశాం.. నేడు అక్కడ నయనమనోహర దృశ్యం కనిపించింది. ఆక్రమణలు తొలగించి ఏకంగా చెరువును సృష్టించిన తీరు.. అద్భుతం అనిపించింది’ అని కర్ణాటక బృందం తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా.. వరద ముంచెత్తలేదని స్థానికులు చెప్పిన విషయాన్ని కమిషనర్‌కు వివరించారు. ఇదే పరిస్థితి మిగతా చెరువుల చెంత ఉందని కొనియాడారు. బెంగళూరు నగర మాజీ మేయర్, చెరువులను పునరుద్ధరణలో భాగస్వామ్యం అయిన అధికారులు, కాంట్రాక్టర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సాంకేతిక బృందంతో సభ్యులు నగరంలో హైడ్రా పునరుద్ధరించిన చెరువులను సందర్శించారు.






