- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYDRAA: శభాష్ ‘హైడ్రా’..! రూ.700 కోట్ల విలువైన భూమి స్వాధీనం
నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా ముప్పేట దాడి చేస్తూ కబ్జాదారులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా (HYDRAA) ముప్పేట దాడి చేస్తూ కబ్జాదారులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. తాజాగా కొండాపూర్-మదీనాగూడ పరిధిలో కబ్జాకు గురైన సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనాగూడ (Madinaguda) వెళ్లే మార్గంలో ఉన్న జంగమోనికుంట (Jangamonikunta) అనే స్థానిక కుంట భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటను అక్రమార్కులు మట్టితో పూడ్చివేసి ఏకంగా చదును చేశారు. అనంతరం అదే భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఫిర్యాదులతో కదిలిన యంత్రాంగం..
ఈ అక్రమ కబ్జాపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు, అది ప్రభుత్వ కుంట భూమి అని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆపరేషన్ చేపట్టి, ఆక్రమణలను తొలగించి కుంట చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.






