పెద్ద సమస్యను సాల్వ్ చేసిన హైడ్రా.. ఆటో డ్రైవర్లు హ్యాపీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-05 12:55:59  IST  )

ఆటో డ్రైవర్ల దీర్ఘకాలిక సమస్యకు హైడ్రా(Hydraa) అధికారులు పరిష్కారం చూపించారు.

పెద్ద సమస్యను సాల్వ్ చేసిన హైడ్రా.. ఆటో డ్రైవర్లు హ్యాపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో డ్రైవర్ల దీర్ఘకాలిక సమస్యకు హైడ్రా(Hydraa) అధికారులు పరిష్కారం చూపించారు. హైదరాబాద్‌లో చెత్త సేకరించే జీహెచ్‌ఎంసీ ఆటోలకు ఇన్నాళ్లు పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా ఉండేది. పునరుద్ధరణకు ముందు అంబర్‌పేట్ బతుకమ్మకుంట ప్రాంగణంలోనే చెత్త సేకరణ ఆటోల పార్కింగ్‌ ఉంది. బతుకమ్మకుంట పునరుద్ధరణతో పార్కింగ్‌ స్థలం కోల్పోయారు. తమకు పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలని చెత్త ఆటో నిర్వాహకులు కోరారు. దీంతో బతుకమ్మకుంట సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ దగ్గర పార్కింగ్‌ స్థలం హైడ్రా అధికారులు ఏర్పాటు చేశారు. కాగా, హైడ్రా చర్యలతో బ‌తుక‌మ్మకుంట ఇప్పుడు పిక్నిక్ స్పాట్‌గా మారింది. చెరువు అభివృద్ధిని ద‌గ్గర‌గా ప‌రిశీలించిన స్థానికులు సాయంత్రం అయితే చాలు అక్కడ‌కు చేరుకుని సేద‌దీరుతున్నారు. పిల్లల ప్లే ఏరియా అందుబాటులోకి వ‌చ్చింది. వ‌య‌సు మ‌ళ్లిన‌ వారు అక్కడ కూర్చొని సేద దీరేందుకు గుమ్మటాలు, చుట్టూ న‌డ‌క దారి, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. హైడ్రాను తీసుకొచ్చిన ప్రభుత్వానికి స్థానికులు అభినంద‌న‌లు తెలిపారు. హైడ్రాతోనే ఇది సాధ్యమైంద‌ని అంటున్నారు.

Next Story