- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYDRAA: లొకేషన్‌ను షేర్ చేస్తే చాలు.. వెంటనే చర్యలు
నివాసాలతో పాటు.. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న కట్టడాలుంటే 9000113667కు సమాచారం అందించాలని హైడ్రా గురువారం ఒక ప్రకటనలో కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నివాసాలతో పాటు.. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న కట్టడాలుంటే 9000113667కు సమాచారం అందించాలని హైడ్రా గురువారం ఒక ప్రకటనలో కోరింది. కూలడానికి సిద్ధంగా ఉన్న పురాతన భవనాలను ముందే గుర్తించి భద్రంగా కూల్చేయడం ద్వారా ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది హైడ్రా. బెంగళూరులో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి శివాజీనగర్‌లోని బోవ్రింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రి సమీపంలోని ప్రహరీ కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మన నగరంలో కూడా పురాతన భవనాలు కూలి ప్రాణ నష్టం సంభవించిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా హైడ్రా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నామని పేర్కొంది.
ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యమై.. సమాచారం అందివ్వాలని కోరింది. ఏ ప్రాంతంలో ఉంది... ఆ భవనం లేదా కట్టడం ఫొటోతో పాటు.. కరెంటు లొకేషన్‌ను పై నంబరుకు షేర్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హైడ్రా తెలిపింది. వర్షాకాలంలోనే పురాతన భవనాల ముప్పు పొంచి ఉంటుందనే ఆలోచనలో ప్రజలు ఉండొద్దని.. అకాల వర్షాలు పడుతున్న వేళ ఎప్పుడైనా ప్రమాదం ఉంటుందని గ్రహించి సమాచారం ఇవ్వాలని కోరింది. శిథిలావస్థలో ఉన్న భవనాలు, కట్టడాల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.






