మ‌రో రెండు వారాలు హైడ్రా ప్రజావాణికి విరామం

by Naga Rani Yarlagadda |

ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హిస్తున్న హైడ్రా ప్ర‌జావాణి కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 8వ తేదీతో పాటు 15వ తేదీన ర‌ద్దు చేసిన‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు.

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్రజావాణికి విరామం
X
  • జూన్ 22వ తేదీ నుంచి పున: ప్రారంభం
  • హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాథ్

దిశ, తెలంగాణ బ్యూరో : ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హిస్తున్న హైడ్రా ప్ర‌జావాణి కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 8వ తేదీతో పాటు 15వ తేదీన ర‌ద్దు చేసిన‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పెండింగ్ ఫిర్యాదులు క్లియ‌ర్ చేసే క్ర‌మంలో మే 11వ తేదీ నుంచి 4 సోమ‌వారాలు ప్ర‌జావాణికి విరామం ఇచ్చిన విష‌యం విధిత‌మే. వాస్త‌వానికి ఈ నెల 8వ తేదీన ప్ర‌జావాణి పునః ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంకా ముఖ్య‌మైన ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించాల్సి ఉన్నందున గ‌డువును మ‌రో రెండు వారాలు పెంచిన‌ట్టు తెలిపారు. జూన్ 22వ తేదీ నుంచి హైడ్రా ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం య‌థాత‌థంగా ఉంటుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Next Story