HYD: రెండున్నర దశాబ్దాలుగా వివాదం.. కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు షురూ

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-04 03:07:42  IST  )

హైదరాబాద్‌లోని కొండాపూర్‌(Kondapur)లో మరోసారి హైడ్రా(Hydraa) అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.

HYD: రెండున్నర దశాబ్దాలుగా వివాదం.. కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు షురూ
X

దిశ, వెబ్‌డెస్క్/ శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని కొండాపూర్‌(Kondapur)లో మరోసారి హైడ్రా(Hydraa) అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య 36 ఎకరాల్లో నిర్మాణాలు కూల్చివేశారు. సర్వే నెంబర్ 59లో ఉన్న 36 ఎకరాల స్థలం.. 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. ఇది ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారించారు. ల్యాండ్ వాల్యూ మొత్తం రూ.3600 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కూల్చివేతల విషయం తెలిసిన స్థానికులు భారీగా అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. 60 ఏళ్లుగా భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని అంటున్నారు. తాము కాపాడుతూ వచ్చిన భూములపై పెత్తనం చెలాయించడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. కూల్చివేతలు కొనసాగుతున్న స్థలానికి పోలీసులు మీడియాను అనుమతి ఇవ్వలేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా, రెండున్నర దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.




Next Story