MLA నుంచి ఎలాంటి కంప్లైంట్ రాలేదు.. హైడ్రా కమిషనర్ వివరణ

by Gantepaka Srikanth |

వంశీరాం బిల్డర్స్ మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు అంశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ గురువారం వెల్లడించారు.

MLA నుంచి ఎలాంటి కంప్లైంట్ రాలేదు.. హైడ్రా కమిషనర్ వివరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వంశీరాం బిల్డర్స్ మ్యాన్ హట్టన్ ప్రాజెక్టు అంశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ గురువారం వెల్లడించారు. ప్రజావాణిలో ఇస్తున్న ఫిర్యాదులకు హైడ్రా రిసిప్ట్‌లు ఇస్తున్నదని తెలిపారు. ఖాజగూడలోని తౌతానికుంట, భగీరథమ్మ చెరువులపైన హైడ్రాకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే ఖాజాగూడలోని కొత్త కుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులందాయని, ఇదే విషయమై హైకోర్టు నుంచి కూడా హైడ్రాకు డైరెక్షన్ వచ్చిందని తెలిపారు. హైకోర్టు డైరెక్షన్‌తోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు మేరకు ఒక్రిడ్జ్ స్కూల్‌కి ఎదురుగా ఉన్న కొత్త కుంట గురించి విచారణ చేపట్టామని చెప్పారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించామని, కొత్తకుంటలోకి వర్షం నీరు రాకుండా అడ్డుగా పనివారికోసం నిర్మించిన షెడ్డులను తొలగించాలని చెప్పినట్టు వివరించారు.

Next Story