‘ఏం జరిగినా ఎదుర్కోవడానికి మేం రెడీ’.. హైడ్రా చీఫ్ రంగనాథ్ ప్రకటన

by Gantepaka Srikanth |

భారీ వర్షాలు, వరదల(Hyderabad Floods)పై హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాథ్(AV Ranganath) కీలక ప్రకటన చేశారు.

‘ఏం జరిగినా ఎదుర్కోవడానికి మేం రెడీ’.. హైడ్రా చీఫ్ రంగనాథ్ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదల(Hyderabad Floods)పై హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాథ్(AV Ranganath) కీలక ప్రకటన చేశారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ‘బుధవారం సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎంతటి విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో పని చేస్తున్నాం. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీళ్లు వస్తే పబ్లిక్‌ను రెస్క్యూ చేయడానికి బోట్స్‌తో సహా అన్ని ఎక్విప్‌మెంట్స్ సిద్ధంగా పెట్టుకున్నాం. రాత్రి సమయంలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలుండటంతో ఈరోజు రాత్రి హైడ్రా టీమ్స్ అందుబాటులో ఉంటాయి. నాలాల కబ్జాలతో రోడ్లపై వరద నీళ్లు వస్తున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో 400 కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఇప్పటికే సిబ్బంది ఉన్నారు. అత్యవసరమైతే తప్ప పబ్లిక్ బయటకి రావొద్దు. ఒకవేళ భారీ వర్షాలు వస్తే యూత్ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరుతున్నాను’ అని హైడ్రా చీఫ్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.

Next Story