- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలిటికల్ ఎంట్రీపై హైడ్రా చీఫ్ రంగనాథ్ క్లారిటీ
పొలిటికల్ ఎంట్రీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ మీడిచా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: పొలిటికల్ ఎంట్రీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ మీడిచా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ‘ఆధారాలు లేకుండా నాపై, హైడ్రాపై పొలిటీషియన్లు ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రా ఎక్కడా రాజీపడలేదు. రాజీపడిందని నిరూపిస్తే పదవిని వదులుకుంటా. రాజకీయాలకు అతీతంగా ఎవర్నీ వదలం. కొందరు ఇప్పుడు పార్టీ మారి లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని.. దానికి నేను కారణమని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోలేదు. నేను పాపాల భైరవుడిలా మారిపోయాను. హైడ్రా చాలా మంది అధికారులపై ఫిర్యాదు చేసింది. నాకు పిబ్లిసిటీ పిచ్చి ఉందని ప్రచారం ఉందని నేనంటే నచ్చని వాళ్లు ప్రచారం చేస్తున్నారు. అవేమీ నేను పట్టించుకోను. భవిష్యత్‌లో రాజకీయాల్లోకి కూడా వచ్చే ఉద్దేశం నాకు లేదు. నా ఉద్యోగాన్ని నేను సక్రమంగా చేసుకుంటూ పోతున్నాను. నా ఇల్లు కూడా అన్ని అనుమతులతో సక్రమంగా కట్టుకున్నాను’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.






