Hydra : హైడ్రా వీకెండ్ కూల్చివేతలు షురూ!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-25 06:38:47  IST  )

హైడ్రా(Hydra)వీకెండ్ కూల్చివేతలు షురూ అయ్యాయి. మేడ్చల్ ఘట్‌కేసర్‌ సమీపంతో నారపల్లి దివ్యనగర్‌లో హైడ్రా కూల్చివేత(Hydra Demolitions)లు ప్రారంభించారు.

Hydra : హైడ్రా వీకెండ్ కూల్చివేతలు షురూ!
X

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(Hydra)వీకెండ్ కూల్చివేతలు షురూ అయ్యాయి. మేడ్చల్ ఘట్‌కేసర్‌ సమీపంలోని పోచారం మున్సిపాలిటీలో నారపల్లి దివ్యనగర్‌లో హైడ్రా కూల్చివేత(Hydra Demolitions)లు ప్రారంభించారు. నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థ(Nalla Mallareddy College) లు ప్రభుత్వం స్థలం కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసినట్లుగా హైడ్రా సర్వేలో తేలింది. దీంతో హైడ్రా అధికారులు నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం అక్రమంగా నిర్మించిన 4 కిలోమీటర్ల అక్రమ కాంపౌండ్‌ వాల్ కూల్చివేత పనులు చేపట్టారు. హైడ్రా కూల్చివేతల పనుల సందర్భంగా గొడవలు తలెత్తకుండా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

ప‌లు కాల‌నీల‌కు, నివాస ప్రాంతాల‌కు వెళ్లేందుకు అవ‌కాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే ఔట్ చుట్టూ ఉన్న ప్రహ‌రీ తొల‌గింపుతో లేఔట్ వాసులతో పాటు పరిసర కాలనీల నివాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రహరీ కూల్చివేతతో ఏక‌శిలా లే ఔట్‌, వెంక‌టాద్రి టౌన్‌షిప్‌, సుప్రభాత్‌ వెంచ‌ర్ -1 , మ‌హేశ్వరి కాల‌నీ, క‌చ్చవాణి సింగారం, ఏక‌శిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీన‌గ‌ర్‌, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాల‌నీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచ‌ర్ -2, 3, సాయిప్రియ‌, మేడిప‌ల్లి, ప‌ర్వత‌పురం, చెన్నారెడ్డి కాల‌నీ, హిల్స్ వ్యూ కాల‌నీ, ముత్తెల్లిగూడల వాసులకు మార్గం సుగమమైందని హైడ్రా వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీఉన్న దివ్య లేఔట్ మొత్తం విస్తీర్ణం 200 ఎక‌రాల వ‌ర‌కూ ఉంటుందని.. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారని.. ఈ ప్లాట్లలో 30 శాతం న‌ల్ల మ‌ల్లారెడ్డివేనంటూ స్థానికుల ఆరోపిస్తున్నారు. కాగా ప్రహారీ కూల్చివేత సందర్భంగా నల్ల మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం హైడ్రా అధికారులతో గొడవకి దిగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

కాగా ఇటీవల అమీన్​పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై సమగ్ర సర్వేకు హైడ్రా సిద్ధమైంది. పురపాలకసంఘం పరిధిలోని ఆయా కాలనీల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తున్న క్రమంలో సమగ్ర సర్వే చేపట్టాలని కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను గోల్డెన్ కీ వెంచర్స్ సంస్థ ఆక్రమించుకుంటుందని వెంకటరమణ కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.

Next Story