కొత్వాల్‌గూడలో రంగంలోకి దిగిన ‘హైడ్రా’.. మంత్రి అనుచరుల క్రషర్ల కూల్చివేత!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 04:32:06  IST  )

హైడ్రా అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో భారీ కూల్చివేతలు చేపట్టారు.

కొత్వాల్‌గూడలో రంగంలోకి దిగిన ‘హైడ్రా’.. మంత్రి అనుచరుల క్రషర్ల కూల్చివేత!
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా (HYDRAA) మరోసారి యాక్షన్‌లోకి దిగింది. కొత్వాల్‌గూడలోని 5 స్టోన్ క్రషర్లను కూల్చివేయగా, 12 ఆర్ఎంసీ యూనిట్లను అధికారులు ఇవాళ ఉదయం తొలగించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో మంత్రికి సంబంధం ఉందంటూ ప్రచారం జరగుతున్న క్రషర్ల చుట్టూ గత కొంతకాలంగా ప్రతిపక్షాలు ఆరోపణలు లెవనెత్తుతున్నాయి. జీవో నంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్‌సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల నడుమ కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఇప్పటికే 15 స్టోన్ క్రషర్లకు జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే, సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ జాబితాలో లేదని స్థానిక అధికారులు తెలపడం గమనార్హం.

Next Story