- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమీర్‌పేట ముంపునకు ‘హైడ్రా’ సొల్యూషన్.. ముమ్మరంగా నాలాల డీసిల్టింగ్ పనులు
వర్షం వచ్చిందటే ఆందోళన. 10 సెంటీ మీటర్ల వర్షం పడితే రహదారులన్నీ జలమయం.

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షం వచ్చిందటే ఆందోళన. 10 సెంటీ మీటర్ల వర్షం పడితే రహదారులన్నీ జలమయం. ఇక అమీర్‌పేట గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. జూబ్లీహిల్స్, గాయత్రీ హిల్స్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, మధురానగర్, శ్రీనివాస నగర్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ముందుకు సాగక అమీర్‌పేటలో నడుం లోతు నీళ్లు ప్రధాన రహదారిపై నిలిచిపోవడం.. వాహన రాకపోకలకు ఇబ్బంది కలగడం.. ఇవన్నీ నగరవాసులకు ప్రతి ఏటా అనుభవంలోకి వచ్చిన వరద కష్టాలే. ఈ ఏడాది ఆ సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. ఈ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిరంతరం పర్యవేక్షించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో పలుమార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కార మార్గం చూపారు. గురువారం అమీర్‌పేటలో పర్యటించి పూడుకుపోయిన నాలాల నుంచి మట్టిని, చెత్తను తొలగించే పనులను పర్యవేక్షించారు.
అమీర్‌పేట ఓ నమూనా..
అమీర్‌పేటలో వరద ముప్పు తప్పించేందుకు అనుసరించిన విధానం నగరంలోని అనేక ముంపు ప్రాంతాలకు పరిష్కార మార్గమని హైడ్రా కమిషనర్ తెలిపారు. పూడుకుపోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలా వరకు వరద సమస్యకు పరిష్కారం చూపగలమని చెప్పారు. ఆయన అమీర్‌పేట్‌లోని మైత్రివనం జంక్షన్, గాయత్రీ నగర్ ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొత్తం 6 పైపులైన్లుండగా.. 3 లైన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధణ పనులు పూర్త య్యాయి. మరో 3 లైన్లలో పూడిక తీయడంతో పాటు.. ఈ వరదంతా గాయత్రీ నగర్‌పై పడకుండా అక్కడ సైతం పైపులైన్లలో మట్టిని తొలగించే పనిని పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు.
45 ట్రక్కుల మట్టి తరలింపు
శ్రీనివాస్‌నగర్ వెస్ట్ సైడ్ వరద కాలువపై న కాంక్రీట్‌తో వేసిన పైకప్పు తెరచి పూడిక తీత పనులను హైడ్రా చేపట్టింది. ఇప్పటి వ రకు 45 ట్రక్కుల మట్టిని తొలగించింది. మరో 3 పైపు లైన్లలోనూ పూడికను తొలగిస్తే 15 సెం.మీ వర్షం పడినా అమీర్‌పేటలో వరద ముంచెత్తదు. ఇదే మాదిరి నగరంలోని ముంపు సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కల్వర్టులు, అండర్‌గ్రౌండ్ పైపులైన్లలో పూడికను తొలగించి ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని హైడ్రా కమిషనర్ సూచించారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు హైడ్రాను అభినందించారు.






