- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన హైడ్రా
హైడ్రా చెరువులనే కాకుండా మనుషులను కూడా కాపాడుతుంది. తాజాగా వరదలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడారు.

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా చెరువులనే కాకుండా మనుషులను కూడా కాపాడుతుంది. తాజాగా వరదలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది కాపాడారు. పాతబస్తీలోని యాకుత్ పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో గౌస్ అనే యువకుడు పడిపోగా స్థానికులు కొద్ది దూరంలోని ఓ కాల్వలో చెత్తను తీస్తున్న హైడ్రా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దీంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అసలు అవకాశం లేని ప్రమాదకర పరిస్థితుల్లో నిచ్చెన కిందకు వేసి దాని ద్వారా యువకుడిని పైకి లాగారు. యువకుడు మేకల మేత కోసం వెళ్లగా ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయినట్టు తెలుస్తోంది. దీంతో హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ హుటాహుటిన సిబ్బందితో అక్కడకు చేరుకుని గౌస్‌ను కాపాడారు. రెయిన్ బజార్ కార్పొరేటర్ వసీతో పాటు..హైడ్రా సిబ్బంది వంశీ, బాలరాజు తదితరులు యువకుడిని కాపాడినవారిలో ఉన్నారు. video






