- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. నెక్నాంపూర్‌లో 23 ఎకరాలకు ఫెన్సింగ్
ఐటీ కేంద్రంగా అత్యంత ఖరీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సోమవారం కాపాడింది.

దిశ, తెలంగాణ బ్యూరో/గండిపేట: ఐటీ కేంద్రంగా అత్యంత ఖరీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సోమవారం కాపాడింది. రూ.2,500 కోట్లకు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ ఆ క్రమణల వెనుక ఉన్న బడాబాబుల కుట్ర లను హైడ్రా భగ్నం చేసింది. సామాన్యులను ముందు పెట్టి భూమిని సొంతం చేసుకుని రూ.కోట్లకు పడగలెత్తేందుకు చేసిన ప్రయత్నాలకు చెక్ పెట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్ సర్వే నంబరు 20లో ఉన్న 23.16 ఎకరాల భూమి ఆక్రమణలకు గురవుతోం దని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో హైడ్రా లోతైన విచారణ చేపట్టింది. ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణలను హైడ్రా తొలగించింది. కొన్ని కట్టడాలను ఇప్పటికే నేలమట్టం చేయగా సోమవారం మరి కొన్ని ప్రహరీలతో పాటు షెడ్డులను తొలగించి వెనువెంటనే 23.16 ఎకరాల ప్రభుత్వ భూ మి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను నెలకొల్పింది.
బడాబాబుల ఆక్రమణలకు చెక్
ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి సామాన్యులను ముందుంచి కబ్జాల పర్వాన్ని నడిపించిన బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తిగా ప్రభుత్వ భూమి అయినప్పటికీ.. పాకాల పోచయ్య దగ్గర భూమిని కొన్నట్టు మహ్మద్ ఇబ్రహీం తప్పుడు రికార్డులను సృష్టించారు. ఇలా కొన్నామని చెప్పిన భూమికి సంబంధించి పాసు బుక్కులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నుంచి వచ్చిన ఆ దేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. ఎలానూ తన వద్ద కొన్నట్టు మహ్మద్ ఇబ్రహీం నకిలీ రికార్డు సృష్టించడంతో పోచయ్య కుటుంబం హక్కుల కోసం పోరాడడం ఇక్కడ గమనార్హం. ఈ తంతుపై మహ్మద్ ఇబ్రహీం పై రెవెన్యూ అధికారులు నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 1975లో ఈ భూమిని పోచయ్య దగ్గర నుంచి కొన్నట్టు మహ్మద్ ఇబ్రహీం తప్పుడు పత్రాలు సృష్టిస్తే 2019లో పాకాల పోచయ్యకు టుంబ సభ్యులు అదే భూమి తమదంటూ పోరాటం మొదలు పెట్టడం కొసమెరుపు.
ఊపిరి పీల్చుకున్న స్థానికులు
వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ కొట్టే ద్దామని బడాబాబులు చేసిన ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. సామాన్యులను ముం దు పెట్టి బడాబాబులు చేసే కబ్జా ప్రయత్నాలకు హైడ్రా భగ్నం చేసింది. అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రాకు స్థానికులు ధన్యవదాలు తెలిపారు. నగర ప్రణాళిక నిబంధనల ప్రకారం.. ప్రణాళికాబద్ధ అభివృద్ధితో పాటు ఓపెన్ స్పేస్, గ్రీన్ జోన్లుగా ఈ స్థలాలను అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా వంటి పటిష్టమైన వ్యవస్థను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
అమీన్‌పూర్‌లో పార్కు స్థలానికి ఫెన్సింగ్
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం అమీన్‌పూర్ విలేజ్‌లోని సర్వే నంబర్ 1019, 1020(పి)లో 2.27 ఎకరాల పరిధిలో లేఔట్ వేశారు. 2005లో 24 ప్లాట్లతో అపెక్స్ ప్రాపర్టీస్ వారు ఈ లేఔట్ వేశారు. ఇందులో సగం ల్యాండ్ ఓ నర్‌వి కాగా.. అపెక్స్ డెవలపర్స్‌వి మిగతావి అనే మాదిరి వేసిన లే ఔట్‌లో 672 గజాల మేర పార్కుకు కేటాయించారు. ఇలా కేటాయించిన పార్కు స్థలాన్ని 2013లో ల్యాండ్ ఓనరల్ తన బంధువుకు గిఫ్ట్ డీడ్ చేశారు. దీంతో వివాదం మొదలైంది. దీనిపై ఇండస్ వ్యాలీ-2 నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. పార్కు స్థలమే అని నిర్ధారణ అవ్వడంతో ఆక్ర మణలను తొలగించి 672 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలంగా పార్కు స్థలం కోసం పోరాడుతున్నామని.. హైడ్రా చర్యలతో ఇది సాధ్యమైందని ఇండస్ వ్యాలీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలాన్ని డబ్బుల్లో లెక్క కడితే రూ.5 కోట్ల విలువ ఉంటుందని పేర్కొన్నారు.






