HYDRA: హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల జోరు.. అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్

by Ramesh Naini |

ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

HYDRA: హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల జోరు.. అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి (Hydra Prajavani) కార్యక్రమం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని బుద్ద భవన్ హైడ్రా (HYDRA) కార్యాలయంలో ఇవాళ హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలోనే హైడ్రా ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు జోరు కొనసాగుతోంది. బాధితుల నుంచి స్వయంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఓవైపు ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులకు హైడ్రా కమిషనర్‌ ఆదేశాలు ఇస్తున్నారు. ఇక, సాయంత్రం 6 గంటల వరకు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ ఉంటుంది.

హైడ్రా రాకతో కబ్జాల ఆగుతున్నాయని ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు అభిప్రాయపడ్డారు. కాగా, కుత్బుల్లాపూర్ పరిధిలోని జగద్గిరిగుట్టపై ఉన్న ఆలయ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయం తెలిసిందే. గూగుల్ మ్యాప్స్ పరిశీలించి 2024 జూలై తర్వాత వచ్చే కబ్జాలను గుర్తిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

Next Story