- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AV Ranganath: రెండ్రోజుల్లో నిర్మాణం చేపట్టండి
ఫిలింనగర్(Filmnagar) లేఅవుట్‌ను పరిశీలించిన హైడ్రా అధికారులు.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫిలింనగర్(Filmnagar) లేఅవుట్‌ను పరిశీలించిన హైడ్రా అధికారులు.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు నిర్ధారించారు. అదే స్థలానికి అనుకుని ఉన్న ఇల్లు ప్రహరీ కూడా ఆక్రమించి నిర్మించినట్టు నిర్ధారించారు. అక్కడ రేకుల షెడ్డుతో పాటు ఆ పక్కనే రోడ్డు మీదకు వచ్చిన ఇంటి ప్రహరీని కూడా శనివారం అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేతల గురించి జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి(Zonal Commissioner Anurag Jayanti)తో హైడ్రా(Hydra) కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) మాట్లాడారు. రెండు రోజుల్లో రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. 15 ఏండ్లుగా అక్కడ నిర్మాణాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణల కూల్చివేయడంతో రహదారి విస్తరణ జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో మరిన్నికూల్చివేతలు ఉంటాయని హైడ్రా అధికారులు చెబుతున్నారు.






